

భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో హైదరాబాద్‌లో జూలై 14 నుంచి 16 వరకు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్ 2026 జరగనుంది. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాల నుంచి మొత్తం 14 దేశాలకు చెందిన సుమారు 110 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్మిక సంక్షేమం, ఉపాధి విధానాలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చలు జరుగనున్నాయి.
ఈ సదస్సులో 'అందరికీ సామాజిక భద్రత', 'భవిష్యత్ ఉద్యోగ ప్రపంచానికి నైపుణ్యాలు', 'మహిళలు మరియు భవిష్యత్ ఉపాధి', 'మానవ కేంద్రిత సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సు' అనే నాలుగు ప్రధాన అంశాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్సులు తమ సిఫార్సులను సమర్పించనున్నాయి. జూలై 14న సాయంత్రం నిర్వహించే వర్కర్స్ కాన్‌ఫ్లుయెన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వరంగ, సామాజిక భద్రత మరియు అసంఘటిత రంగాలకు చెందిన సుమారు 1,500 మంది కార్మికులు పాల్గొననుండగా, విదేశీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలకనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!