
జనరల్

ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. భారత రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకుంటూ.. రాజ్యాంగం అందించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రతి పౌరుడు తన బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.
అధికారంలో ఎవరు ఉండాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం ఓటర్లకు మాత్రమే ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాకుండా ముందుగా దానిని చదివి, అందులోని అంశాలను అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగం పట్ల గౌరవం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కనిపించాలని హితవు పలికారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!