
జనరల్

గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో సెస్నా-152 శిక్షణ విమానానికి ప్రమాదం జరిగింది. అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌తో పాటు ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌కు గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విచారణ చేపట్టనుంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు ఆరా తీయనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!