

ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అనూ ఫర్నిచర్ గచ్చిబౌలిలో తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. 32 ఏళ్ల ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిన ఈ స్టోర్‌ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, బిగ్ బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ ప్రారంభించారు. విశాలమైన ఈ షోరూమ్‌లో ఆధునిక శైలిలో రూపొందించిన గృహ, కార్యాలయ ఫర్నిచర్ విభిన్న శ్రేణులు ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమానికి సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అతిథులు, పెద్ద సంఖ్యలో కస్టమర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మాట్లాడుతూ, చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థ 19వ స్టోర్‌ను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. అనూ ఫర్నిచర్ నాణ్యత, వినూత్న డిజైన్లు, వినియోగదారుల నమ్మకం వల్లే ఈ విజయాన్ని సాధించిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ రమణ రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. డైరెక్టర్లు భరత్ అవినాష్ రెడ్డి, అక్షిత మాట్లాడుతూ నాణ్యత, సాంకేతికత, వినియోగదారుల సంతృప్తి సంస్థ విజయానికి పునాది అని పేర్కొన్నారు. ఈ స్టోర్‌లో సోఫాలు, డైనింగ్ సెట్లు, బెడ్‌రూమ్ ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్లు, ఆఫీస్ ఫర్నిచర్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!