

బీఆర్ఎస్ యువసంగ్రామ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. “బేవకూఫ్ మాటలు మానుకో కేటీఆర్.. తొడ్కల్ తీస్తాం బిడ్డా” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చీకటిలో ఉన్నది కేటీఆర్ అని, తాము కాదని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజల కోసం కాకుండా చోరీలపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు.
కల్వకుంట్ల కుటుంబం సంకుచిత రాజకీయాలు చేస్తోందని సంపత్ కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తన గతాన్ని గర్వంగా చెప్పుకునే వ్యక్తి అని, కానీ కేటీఆర్ అమెరికాలో చేసిన పనుల గురించి చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ యువసంగ్రామ సభ ఒక రాజకీయ షో మాత్రమేనని, 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో లెక్కలు తేల్చుకుందామని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!