
సినిమాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఇతర పరిపాలనా అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.
ఎన్నికలకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం టెండర్లు పిలవాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, 13 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఎన్నికల ఏర్పాట్లు వేగం పుంజుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!