25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్

Writer: Harika S 11:06 PM, 25 నవంబర్, 2026
తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పురుషుల ఆరోగ్యాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పురుషుల్లో ఎక్కువగా నమోదవుతున్న టాప్ 4 క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటిగా నిలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఈ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఇది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది.

గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 2026 సంవత్సరంలో పురుషులలో కొత్త క్యాన్సర్ కేసుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వాటా 6.9 శాతంగా (సుమారు 2,020) ఉంది. రాష్ట్రంలో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ క్యాన్సర్ల తర్వాత ప్రొస్టేట్ క్యాన్సర్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అలాగే తెలంగాణలో క్యాన్సర్ కేసుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వాటా 6.1 శాతంగా (సుమారు 1,300 కేసులు) ఉంటుందని, ఇక్కడ కూడా ఇది నాల్గవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది.ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధానంగా వయసు పైబడిన పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా పూర్తి స్థాయిలో నయం చేసే అవకాశాలు మెరుగవుతాయి.

ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించి కొన్ని ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది కలగడం, మూత్ర ప్రవాహం బలహీనంగా లేదా ఆగి ఆగి రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే మూత్రంలో గానీ, వీర్యంలో గానీ రక్తం పడటం, నడుము కింది భాగం, తుంటి లేదా కటి భాగంలో నిరంతరం నొప్పి కొనసాగడం వంటివి కూడా ఈ క్యాన్సర్ ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.

అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, పైన పేర్కొన్న లక్షణాలు కేన్సర్ కాని సాధారణ ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల (నాన్-క్యాన్సరస్ ఎన్‌లార్జ్‌మెంట్) ఉన్నప్పుడు కూడా కనిపించే అవకాశముంది. అందువల్ల పురుషులు మూత్ర సంబంధిత మార్పులను తేలికగా తీసుకోకుండా, అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయండి.. వైద్యుల సూచన!

చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయండి.. వైద్యుల సూచన!

అరటి ఆకుల్లో భోజనం చేయడం ఎందుకు మంచిదంటే - వైద్యుల వివరణ

అరటి ఆకుల్లో భోజనం చేయడం ఎందుకు మంచిదంటే - వైద్యుల వివరణ

బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!

బొగ్గులపై కాల్చిన చేప కూరతో ఎన్నో రుచులు.. వైద్యులు ఏమంటున్నారంటే!

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!

చలికాలంలో క్యారెట్ జ్యూస్‌తో ఎన్నో లాభాలు.. వైద్యులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలివే!

వైద్యుల సూచన.. పోషకాలతో కూడిన చిక్కుడుకాయల రుచికరమైన కూర

వైద్యుల సూచన.. పోషకాలతో కూడిన చిక్కుడుకాయల రుచికరమైన కూర

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!

రోజూ ఈ మూడు ఆకుల జ్యూస్ తాగితే ఏమవుతుంది? వైద్యులు చెబుతున్న విషయాలివే!

ట్యాగ్లు
తెలుగుఆంధ్రప్రదేశ్తెలంగాణప్రోస్టేట్ క్యాన్సర్ఆందోళన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్
ఆరోగ్యం

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!
జనరల్

క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!

కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!
రాజకీయాలు

కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్
క్రీడలు

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!
సినిమాలు

‘ఆచి ఆచి’ సాంగ్‌లో సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్.. ‘ఇంజి వెల్లం’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

పోస్టాఫీసుల ఆధునీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!
జనరల్

సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌పై MEA నోటీసు..!

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!
టెక్నాలజీ

చైనా పోటీకి జపాన్ ఆటో దిగ్గజాల ఐక్యం!

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!
జనరల్

తెలంగాణ రెరా కొరడా.. మూడు సంస్థలకు భారీ ఫైన్లు!

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?
టెక్నాలజీ

ఫ్రీ యాప్.. యాడ్స్ కూడా లేవు.. వాట్సాప్ కోట్లు ఎలా సంపాదిస్తుందో తెలుసా?

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!
సినిమాలు

మహేష్ బాబు మేనల్లుడి కొరియన్ పెళ్లి.. వియత్నాంలో వేడుక!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!