
జనరల్

ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రితో జరిగిన చర్చల వివరాలను కార్యవర్గ సభ్యులకు నాయకత్వం వివరించింది. అయితే ఉద్యోగులు లేవనెత్తిన కొన్ని కీలక సమస్యలపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో ప్రతిపాదించిన ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఐఆర్, బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని బొప్పరాజు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం వేచి చూడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే మళ్లీ ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!