
షోస్

ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో ముందుగానే జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో జనగణనను ముందస్తుగా చేపట్టనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా జనగణన ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
ఈ నాలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 1 నుంచి జనవరి 4 వరకు జనగణన నిర్వహించనున్నారు. మరోవైపు, మణిపూర్‌లో జనగణనను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జనగణన ప్రక్రియకు సంబంధించిన తదుపరి వివరాలు గెజిట్‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం అమలు చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!