
క్రీడలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 37.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో అత్యధికంగా 61.86 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మలమడుగులోనూ 61.86 శాతం ఓటింగ్ నమోదుకాగా, నగరిలో 60.81 శాతం పోలింగ్ జరిగింది.
ఇక నగరపాలక సంస్థల విషయానికి వస్తే విజయవాడలో 36.40 శాతం, అనంతపురంలో 32.60 శాతం, తిరుపతిలో 32.57 శాతం, కడపలో 30.75 శాతం, విశాఖపట్నంలో 27.55 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!