1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

Writer: Chandrika 03:09 PM, 1 నవంబర్, 2026
నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ బృందం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. గత ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలతో పోలిస్తే ఈసారి భారత షూటర్ల ప్రదర్శన నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ భారత షూటర్లకు కీలక సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఆసియా క్రీడల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ స్టార్ ఇషా సింగ్, జపాన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఇలవేనిల్ వలరివన్ కూడా భారత జట్టు తరఫున పోటీపడనున్నారు. మను 10 మీటర్ల, 25 మీటర్ల పిస్టల్ విభాగాల్లో, ఇషా 25 మీటర్ల పిస్టల్‌లో, ఇలవేనిల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే టోర్నీగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 12 వ్యక్తిగత ఈవెంట్లలో 36 కోటా స్థానాలు అందుబాటులో ఉన్నాయి. వీలైనన్ని ఎక్కువ ఒలింపిక్ కోటా స్థానాలు సాధించి, మెగా క్రీడలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం పొందాలని భారత షూటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన నీరూ దాండా మహిళల ట్రాప్ విభాగంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో పార్థ్ మానే, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్కీట్ విభాగంలో మైరాజ్ అహ్మద్ ఖాన్, అనంత్‌జీత్ సింగ్ నరూకా పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

ఉగాండాపై ఘన విజయం.. కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌గా భారత మహిళలు

ఉగాండాపై ఘన విజయం.. కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌గా భారత మహిళలు

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

కెప్టెన్‌గా విజయాలు ఉన్నా.. బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు అసలైన పరీక్ష

కెప్టెన్‌గా విజయాలు ఉన్నా.. బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు అసలైన పరీక్ష

సేనా గడ్డపై ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు కఠిన సవాల్

సేనా గడ్డపై ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు కఠిన సవాల్

కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆర్గనైజింగ్ బోర్డులోకి రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్

కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆర్గనైజింగ్ బోర్డులోకి రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్

ట్యాగ్లు
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్భారత షూటింగ్ జట్టుమను బాకర్ఇషా సింగ్ఇలవేనిల్ వలరివన్నీరూ దాండాపార్థ్ మానేఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028షూటింగ్ క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్
రాజకీయాలు

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..
క్రీడలు

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్
క్రీడలు

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్-  రణ్‌బీర్ కపూర్
సినిమాలు

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్- రణ్‌బీర్ కపూర్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్
జనరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర
జనరల్

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 2: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి మనసులో ఏముంది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 2: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి మనసులో ఏముంది?

‘మైసా’లో బీస్ట్ మోడ్‌లో రష్మిక
సినిమాలు

‘మైసా’లో బీస్ట్ మోడ్‌లో రష్మిక

ఢిల్లీ ర్యాలీకి వచ్చే వారికి రాహుల్ గాంధీ ప్రత్యేక విజ్ఞప్తి
జనరల్

ఢిల్లీ ర్యాలీకి వచ్చే వారికి రాహుల్ గాంధీ ప్రత్యేక విజ్ఞప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!