1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

Writer: Chandrika 03:14 PM, 1 నవంబర్, 2026
కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

కబడ్డీలో భారత జట్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. తొలి కామన్వెల్త్ కబడ్డీ టోర్నీలో పురుషులు, మహిళల విభాగాల్లో విజేతలుగా నిలిచి డబుల్ టైటిల్ సాధించాయి. శనివారం జరిగిన మహిళల ఫైనల్లో భారత్ 35-15తో ఉగాండాపై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు తొలి పది నిమిషాల్లో 7-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును 15-4కు చేర్చి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. చివరి వరకు అదే జోరు కొనసాగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. రైడింగ్‌లో సాక్షి 10, అను 6, నిధి శర్మ 5 పాయింట్లతో రాణించగా.. ట్యాక్లింగ్‌లో రితు, సుమన్ చెరో నాలుగు పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇక పురుషుల విభాగం ఫైనల్లోనూ భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. శ్రీలంకను 54-17తో చిత్తు చేసి మరో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ తొలి పది నిమిషాల తర్వాత 15-7తో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్కోరు అంతరాన్ని పెంచుకుంటూ 21-9తో విజయానికి చేరువైంది. చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించి భారీ తేడాతో గెలిచింది. దీంతో తొలి కామన్వెల్త్ కబడ్డీ టోర్నీలో పురుషులు, మహిళలు రెండు విభాగాల్లోనూ భారత్ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

ఉగాండాపై ఘన విజయం.. కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌గా భారత మహిళలు

ఉగాండాపై ఘన విజయం.. కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌గా భారత మహిళలు

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

కెప్టెన్‌గా విజయాలు ఉన్నా.. బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు అసలైన పరీక్ష

కెప్టెన్‌గా విజయాలు ఉన్నా.. బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు అసలైన పరీక్ష

సేనా గడ్డపై ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు కఠిన సవాల్

సేనా గడ్డపై ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు కఠిన సవాల్

కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆర్గనైజింగ్ బోర్డులోకి రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్

కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆర్గనైజింగ్ బోర్డులోకి రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్

ట్యాగ్లు
భారత కబడ్డీ జట్టుకామన్వెల్త్ కబడ్డీ టోర్నీమహిళల కబడ్డీపురుషుల కబడ్డీఉగాండాశ్రీలంకసాక్షిఅనునిధి శర్మకబడ్డీ ఛాంపియన్‌షిప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్
రాజకీయాలు

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..
క్రీడలు

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్
క్రీడలు

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్-  రణ్‌బీర్ కపూర్
సినిమాలు

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్- రణ్‌బీర్ కపూర్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్
జనరల్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

రామ్ చరణ్ RC 17 ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర
జనరల్

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 2: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి మనసులో ఏముంది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 56 ప్రోమో 2: బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరి మనసులో ఏముంది?

‘మైసా’లో బీస్ట్ మోడ్‌లో రష్మిక
సినిమాలు

‘మైసా’లో బీస్ట్ మోడ్‌లో రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!