
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 7న ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు, పరిపాలనా అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలు, సమన్వయం, భద్రతా ఏర్పాట్లపై ఎస్ఈసీ అధికారులు సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై ఇప్పటికే అధికారికంగా చర్యలు కొనసాగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!