
జనరల్

హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు చైనా మాంజా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. విధులకు వెళ్తున్న సమయంలో అనూహ్యంగా చైనా మాంజా ఆయన మెడ భాగానికి తగలడంతో గొంతు వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి.
తక్షణమే సహచరులు స్పందించి ఆయనను ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం మెడ మరియు గొంతు వద్ద లోతైన గాయాలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతుండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో మరోసారి చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల పై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత మాంజా వినియోగాన్ని పూర్తిగా నివారించాలని అధికారులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!