
జనరల్

అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ సైదాబాద్ వాణినగర్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో 45 ఏళ్ల నజేయా సల్మా, ఆమె 19 ఏళ్ల కుమార్తె నిహాయీన్ షేక్, 14 ఏళ్ల కుమారుడు ఉమర్ షేక్ ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ఒకే కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 47 ఏళ్ల షేక్ అబ్దుల్ నవీద్‌తో పాటు ఐదేళ్ల చిన్నారి ఖదీజా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. ఈ విషాద ఘటన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా, స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!