
సినిమాలు

అసోంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినప్పటికీ ఆరు జిల్లాల్లో సుమారు 6.55 లక్షల మంది ఇప్పటికీ వరద ప్రభావంలోనే ఉన్నారు. చరాయిదేవ్, దిబ్రూగఢ్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో వరదల కారణంగా జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. తాజా సమాచారం ప్రకారం వరదల కారణంగా మృతుల సంఖ్య 66కు చేరింది.
వరద బాధితులకు ఆశ్రయం, ఆహారం, ఇతర నిత్యావసరాలు అందించేందుకు అధికారులు 274 సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీటితో ఇళ్లు, రహదారులు, వ్యవసాయ భూములు దెబ్బతినగా, వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!