

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 9:30 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తొమ్మిది మంది వేలంలో పాల్గొననున్నట్లు నిర్వాహకుల అప్‌డేట్ ప్రకారం తెలుస్తోంది. పాల్గొనే వారు రూ.35 లక్షల చొప్పున డిపాజిట్ చేసినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా బాలాపూర్ లడ్డూ వేలం ధర క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో ఈసారి కూడా గతేడాది ధర కంటే మరో రూ.4–5 లక్షలు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 2025లో బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలకు వేలం పలికింది.
మరోవైపు ఈ ఏడాది బాలాపూర్ గణేష్‌ను ఇప్పటికే సుమారు 8 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా ఈసారి పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెట్ విశేషంగా ఆకట్టుకుందని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ కెల్లం నిరంజన్ రెడ్డి తెలిపారు. సుమారు 70 మంది కళాకారులు నెల రోజుల పాటు పనిచేసి ఈ మండపాన్ని రూపొందించినట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!