
సినిమాలు

పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను రేపు జస్టిస్ కలసికం సుజన ధర్మాసనం చేపట్టనుంది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
తాను నిర్దోషినని, ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని బండి భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు, ఈ పిటిషన్‌పై ప్రభుత్వ తరఫు వాదనలు కూడా విచారణ సందర్భంగా వినిపించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!