

‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’. సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సప్తగిరి కీలక పాత్రలో కనిపించనున్నారు. కాండిడ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా పి. వివేకానంద్ వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. రవికిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయగా, ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంటోంది.
సినీ అభిమానులకు ప్రత్యేక గుర్తింపు ఉన్న పనసపల్లి గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. గ్రామంలోని గోడలపై కొత్త సినిమాల పోస్టర్లు కనిపించాల్సిందే అన్నట్టుగా అక్కడి సినిమా అభిమానం ఉంటుంది. హీరో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, హీరోయిన్ బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షురాలిగా కనిపించనున్నారు. తమ అభిమాన హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డుల విషయంలో వీరిద్దరి మధ్య జరిగే పోటీ కథలో ఆసక్తిని పెంచుతోంది. ఈ ఫ్యాన్ వార్ ఎక్కడి వరకు వెళ్లింది, ఎలాంటి మలుపులు తిరిగింది, ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించింది అనేది సినిమాలో చూడాల్సి ఉంది. నరేష్ అడుపా ఎడిటర్‌గా, మోహన్ చారి సినిమాటోగ్రాఫర్‌గా, ఎంఎల్ రాజా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్‌ను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!