

బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను లక్ష్యంగా పెట్టుకున్న డిగ్రీ పూర్తి చేసిన యువతకు భారీ అవకాశం లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి 13 వేలకుపైగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా 5,000 అప్రెంటిస్ పోస్టులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 7,500 అప్రెంటిస్ పోస్టులు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 635 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు నెలకు రూ.12,300 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్ అందించనున్నారు. డిగ్రీ అర్హతతో ఈ అవకాశాలకు పోటీ పడవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐల్లో ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేపడతారు. పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉండవు. మరోవైపు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అప్రెంటిస్ నియామకాలను ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా చేపడుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ దరఖాస్తుల గడువు జూన్ 8 కాగా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కు జూన్ 6 చివరి తేదీ. గత ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులపై దృష్టి పెట్టి సన్నద్ధమైతే అవకాశాలు మరింత మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!