

నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు, వందేమాతరం బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అధిష్ఠాన్ బిల్లు వంటి కీలక చట్టప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లులపై సభలో విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు నీట్ పేపర్ లీక్, అయోధ్య విరాళాల చోరీ, ఇథనాల్ బ్లెండింగ్, పార్టీ ఫిరాయింపుల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి విస్తృత సంప్రదింపులు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మద్దతు తెలిపే సంకేతాలు ఇవ్వగా, బిల్లుకు అవసరమైన రెండు మూడవ వంతు మెజారిటీ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!