
జనరల్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వర్ష పాశుపత వరుణ యాగం ఆదివారం ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు తొలగి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ఈ ప్రత్యేక యాగాన్ని నిర్వహిస్తున్నారు.
వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తూ లోకక్షేమం, సకాలంలో వర్షాలు, పంటల సుభిక్షం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఈ యాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!