

ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనల నేపథ్యంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వినీ రాజే సింగ్ కూడా ఉన్నారు. బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలోని పార్కులో కూర్చున్న సమయంలో పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని ఆమె ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తనను కేశవ్ పురం పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. సీజేపీ నిరసనలకు ముందు ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసి పలు ఆంక్షలు విధించారు. యశస్వినీ రాజే సింగ్ తండ్రి విక్రమ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సదర్ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలకు యశస్వినీ మద్దతు తెలిపారు. అప్పట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ నిరసనల్లోనూ ఆమె సీజేపీ ప్రచారానికి మద్దతుగా నిలిచారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!