
సినిమాలు

సైబర్ దాడులు లేదా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించే ప్రమాదం ఉందని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రజల రోజువారీ జీవనానికి తీవ్ర అంతరాయం కలగవచ్చని పేర్కొంది. ఈ తరహా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పౌరులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అత్యవసర పరిస్థితుల్లో కనీసం 72 గంటల పాటు స్వయంగా అవసరాలను నిర్వహించుకునేలా నిత్యావసరాలను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఆహారం, తాగునీరు, మందులు, టార్చ్‌లైట్లు, బ్యాటరీలు వంటి అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. సంక్షోభ సమయంలో ప్రభుత్వ అత్యవసర సేవలపై ఆధారపడే పరిస్థితి తగ్గేలా వ్యక్తిగతంగా సన్నద్ధం కావాలని సూచించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!