17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు

Writer: Pooja 04:04 PM, 17 నవంబర్, 2026
షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు

మాజీ ప్రధాని షేక్‌ హసీనా వచ్చే నెలలో స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోసారి హింస చెలరేగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అధికారులు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నాటు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో ముగ్గురు పాదచారులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ పేలుళ్లకు హసీనా స్వదేశానికి తిరిగి వచ్చే ప్రణాళికలతో సంబంధం ఉందా అనే విషయం ఇంకా స్పష్టంకాలేదు. 2024 ఆగస్టు నుంచి భారత్‌లో ఉంటున్న హసీనా, డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ఆమె మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. బ్యాంకులపై దాడులు, బస్సులకు నిప్పంటించడం వంటి పలు హింసాత్మక ఘటనలు కూడా నమోదయ్యాయి. గత కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా సుమారు 50 నాటు బాంబు పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఈ హింసాత్మక ఘటనలకు అవామీ లీగ్‌ పార్టీ, దాని అనుబంధ సంస్థలే కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో విధ్వంసక చర్యలను అడ్డుకునేందుకు ఢాకా పోలీసులు భద్రతా చర్యలను మరింత పెంచారు. అవామీ లీగ్‌కు కంచుకోటలుగా భావించే ఢాకా, గోపాల్‌గంజ్‌తో పాటు ఇతర జిల్లాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. డిసెంబర్‌ నెలంతా అదనపు బలగాలను మోహరించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, లండన్‌లోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హసీనా ప్రభుత్వ పతనానికి దారితీసిన 2024 ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు, ప్రస్తుతం నేషనల్‌ సిటిజన్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నహీద్‌ ఇస్లాం తూర్పు లండన్‌లోని రామ్‌ఫోర్డ్‌లో బంగ్లాదేశ్‌ ప్రవాసులు నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన పర్యటనను వ్యతిరేకించిన హసీనా మద్దతుదారులు సమావేశ ప్రాంగణం బయట నిరసన చేపట్టారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులపై గుడ్లు, నీళ్ల బాటిళ్లు విసిరినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు

సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

వందేభారత్‌లో అనుకోని ప్రయాణం.. 12 మందికి భారీ ఫైన్!

వందేభారత్‌లో అనుకోని ప్రయాణం.. 12 మందికి భారీ ఫైన్!

కర్రెగుట్టల్లో భారీ మావోయిస్టు డంప్‌ స్వాధీనం

కర్రెగుట్టల్లో భారీ మావోయిస్టు డంప్‌ స్వాధీనం

తెలంగాణ నీటి అవసరాలపై ఛత్తీస్‌గఢ్ సీఎంతో రేవంత్ చర్చలు

తెలంగాణ నీటి అవసరాలపై ఛత్తీస్‌గఢ్ సీఎంతో రేవంత్ చర్చలు

ట్యాగ్లు
షేక్ హసీనాబంగ్లాదేశ్ ఉద్రిక్తతలుఢాకా బాంబు పేలుళ్లుఅవామీ లీగ్నహీద్ ఇస్లాంలండన్ ఘర్షణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా రెండో రోజూ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

కొత్త బీమా తర్వాత.. ముందు ఉన్న రైతు బీమా అమలు చేయాలి: హరీశ్ రావు
రాజకీయాలు

కొత్త బీమా తర్వాత.. ముందు ఉన్న రైతు బీమా అమలు చేయాలి: హరీశ్ రావు

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు
జనరల్

చైనా కోసం అమెరికా కొత్త చిప్ ఆంక్షలు

షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు
జనరల్

షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్‌లో భద్రతా ఆందోళనలు

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు
జనరల్

ప్‌స్టీన్‌ మృతిపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా ఫోరెన్సిక్ నిపుణుడు

బిగ్‌బాస్‌లో వర్షిణి ఆటపై శ్రిష్టి ప్రశ్నలు.. ముకేశ్‌పై త్రిగుణ్ ఘాటు విమర్శలు
షోస్

బిగ్‌బాస్‌లో వర్షిణి ఆటపై శ్రిష్టి ప్రశ్నలు.. ముకేశ్‌పై త్రిగుణ్ ఘాటు విమర్శలు

సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి
జనరల్

సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు రేవంత్ విజ్ఞప్తి

భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి అమెజాన్ భారీ పెట్టుబడి
బిజినెస్

భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి అమెజాన్ భారీ పెట్టుబడి

బిగ్‌బాస్ నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్స్ రచ్చ.. వర్షిణిపై అపూర్వ ఘాటు విమర్శలు
షోస్

బిగ్‌బాస్ నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్స్ రచ్చ.. వర్షిణిపై అపూర్వ ఘాటు విమర్శలు

ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. సీఎస్కే మెంటార్‌గా నియామకం
క్రీడలు

ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. సీఎస్కే మెంటార్‌గా నియామకం

కోడళ్ల రాకతో ఇంట్లో కొత్త సందడి మొదలైంది  – అమల అక్కినేని
సినిమాలు

కోడళ్ల రాకతో ఇంట్లో కొత్త సందడి మొదలైంది – అమల అక్కినేని

కేజ్రీవాల్‌కు హైకోర్టు చివరి హెచ్చరిక!
రాజకీయాలు

కేజ్రీవాల్‌కు హైకోర్టు చివరి హెచ్చరిక!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!