

భారత్‌లో రోడ్ ట్రిప్ చేయాలనుకునేవారికి ప్రకృతి అందాలు, కొండలు, అడవులు, సముద్ర తీరాల మధ్య సాగే ఎన్నో అందమైన మార్గాలు ఉన్నాయి. వీటిలో మనాలి నుంచి లెహ్ వరకు సాగే ప్రయాణం ప్రత్యేకమైనది. సుమారు 450 కిలోమీటర్ల ఈ మార్గంలో రోహ్‌తాంగ్, బరాలాచా లా, తాంగ్ లాంగ్ లా వంటి ఎత్తైన పర్వత మార్గాలు కనిపిస్తాయి. ముంబై నుంచి గోవాకు వెళ్లాలనుకునేవారు పూణె, కొల్హాపూర్ మీదుగా లేదా రత్నగిరి, సావంత్‌వాడి మీదుగా సాగే కొంకణ్ తీర మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ రెండు మార్గాల్లోనూ అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
చారిత్రక కట్టడాలు, కోటలను చూడాలనుకునేవారికి జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్, ఉదయ్‌పూర్‌లను కలుపుతూ సాగే రాజస్థాన్ రోడ్ ట్రిప్ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రయాణం 1,120 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతాలను సందర్శించేందుకు అనుకూలమైన సమయంగా చెబుతారు. ప్రకృతిని ఇష్టపడేవారు బెంగళూరు నుంచి మైసూరు, బందీపూర్ మీదుగా ఊటీకి వెళ్లవచ్చు. ఈ మార్గంలో దట్టమైన అడవులు, పచ్చని కొండలు, టీ, కాఫీ తోటలు కనిపిస్తాయి. అలాగే గౌహతి నుంచి తవాంగ్ వరకు సాగే ప్రయాణం ఈశాన్య భారతంలోని పర్వత అందాలను చూపిస్తుంది. ఈ ఐదు మార్గాలు రోడ్ ట్రిప్ ప్రియులకు విభిన్నమైన అనుభవాలను అందిస్తాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!