
జనరల్

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. అమ్మవారి రంగంలో తెలంగాణలో మంచి వర్షాలు కురుస్తాయని భవిష్యవాణి వినిపించిందని, రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఉచిత బస్సు ప్రయాణం సహా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఈసారి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ట్రాఫిక్ వంటి ఇబ్బందులు ఎదురైనా సహకరించిన హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జోగినీలకు గుర్తింపు కార్డుల జారీ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!