
సినిమాలు

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్, మరో నిందితుడు వినోద్ తోమర్లకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం విముక్తి కల్పించింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడం, ఫిర్యాదుదారుల వాంగ్మూలాల్లో వ్యత్యాసాలు ఉండటంతో కేసును కోర్టు కొట్టివేసింది.
2016–2019 మధ్య లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ 2023లో మహిళా రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమంలో వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు పాల్గొన్నారు. మైనర్ ఫిర్యాదుదారు ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో పోక్సో కేసులో ఇప్పటికే విముక్తి పొందిన బ్రిజ్ భూషణ్‌కు, తాజా తీర్పుతో క్రిమినల్ విచారణ పూర్తయింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!