

కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరనున్న మంత్రుల జాబితాకు కాంగ్రెస్ అధ్యక్షుల ఆమోదం లభించింది. ఆమోదం పొందిన వారిలో పీ.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాని, కె.ఎస్. బసవంతప్ప, బి. నాగేంద్ర, టీ. రఘుమూర్తి, బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాళ్ వైద్య, డాక్టర్ అజయ్ సింగ్, ఎన్. చలువరాయ స్వామి, కె.ఎం. శివలింగ గౌడ, హెచ్.సి. బాలకృష్ణ, గాయత్రి శాంతేగౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద్ కాశప్పనవర్, లక్ష్మణ సవాది ఉన్నారు.
అదే సమయంలో కర్ణాటక శాసనసభ, శాసన మండలిలోని కీలక రాజ్యాంగ పదవులకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. జి.ఎస్. పాటిల్ శాసనసభ స్పీకర్‌గా, ఏ.ఎస్. పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా, సలీం అహ్మద్ శాసన మండలి చైర్‌పర్సన్‌గా, ఉమాశ్రీ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యేందుకు అనుమతి లభించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!