

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. 24 గంటలూ పనిచేస్తున్నామని చెప్పుకునే పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు.
గతంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేదని, ఇప్పుడు కరెంట్ సరఫరాపై ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆరోపించారు. చెరువులు ఎండిపోతున్నాయని, రైతులకు యూరియా అందుబాటులో లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సమస్యలకు సమాధానం చెప్పాలని, డైవర్షన్ రాజకీయాలతో ప్రజల గొంతును నొక్కలేరని మన్నె గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!