

టెస్టు క్రికెట్‌లో నిలదొక్కుకుని రాణించడానికి తనకు ఎన్నో ఏళ్లు పట్టిందని టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్నప్పుడు ఒక్కో ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకోవడం సవాలుగా ఉండేదని తెలిపాడు. అవకాశాలు చేజారడం, గాయాలు, అనుభవం తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని చెప్పాడు. న్యూజిలాండ్‌తో వెలింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన రాహుల్.. తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
టీ20, వన్డేల్లో వేగంగా పరుగులు చేయాలనే ఆలోచన నుంచి టెస్టుల్లో ఓపికగా ఆడే విధానానికి మారడం మొదట్లో కష్టంగా ఉండేదని రాహుల్ చెప్పాడు. టెస్టు క్రికెట్‌లో బంతిని ఆచితూచి ఆడటానికి భిన్నమైన ఆలోచనా విధానం, ప్రత్యేకమైన సన్నద్ధత అవసరమని వివరించాడు. విదేశీ పర్యటనలకు ఐదు, ఆరు నెలల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటానని తెలిపాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకుని సన్నద్ధమవుతానన్నాడు. బ్యాటింగ్‌లో ఒక్క చెత్త షాట్ ఆడినా గంటల తరబడి చేసిన శ్రమ వృథా అవుతుందని కాఫీ తయారీతో పోల్చి వివరించాడు. గాయాల కారణంగా 10 నుంచి 15 టెస్టులు ఆడే అవకాశాన్ని కోల్పోయానని, తన నిబద్ధతలో మాత్రం ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌పై సాధించిన శతకం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఆ ఇన్నింగ్స్ తర్వాత సరిగా నిద్ర కూడా పట్టలేదని రాహుల్ వెల్లడించాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!