
బిజినెస్

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తన కాబోయే భార్య, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. తన జీవితంలో ప్రియా ప్రత్యేకమైన వ్యక్తి అని చాటుకుంటూ చేసిన ఈ సందేశం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం రింకూ సింగ్ చేసిన ఈ బర్త్‌డే విషెస్‌పై క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు, రింకూ సింగ్, ప్రియా సరోజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 4న లక్నోలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ జంట ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి తమ వివాహానికి ఆహ్వానించింది. పెళ్లి ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో రింకూ సింగ్ చేసిన పుట్టినరోజు శుభాకాంక్షల సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!