
జనరల్

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వివాదం సుఖాంతమైంది. తమ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని జెట్టి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ వివాదంపై కొంతమంది కావాలనే అపార్థాలు సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన వెల్లడించారు. దీంతో బండ్ల గణేష్‌కు, తనకు మధ్య నెలకొన్న వివాదానికి తెరపడినట్లయింది.
బండ్ల గణేష్‌తో తనకున్న స్నేహం, అనుబంధం ఎప్పటిలాగే కొనసాగుతాయని జెట్టి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, గతంలో మాదిరిగానే స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రకటనతో ఇద్దరి మధ్య వివాదం ముగిసినట్లయింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!