
జనరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరూ చెరో రూ.10 వేల చొప్పున పూచీకత్తు సమర్పించడంతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు నిబంధనలకు అనుగుణంగా బెయిల్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.
కోర్టు ఆదేశాల అనంతరం అవసరమైన బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఇద్దరు నేతలు విడుదలయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన రాజకీయ, న్యాయ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బెయిల్ మంజూరు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!