
జనరల్

ఇస్రోను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సంస్థ ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ స్పష్టం చేశారు. బెంగళూరు స్పేస్ ఎక్స్‌పోలో మాట్లాడిన ఆయన.. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరిగినా ఇస్రో ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదని తెలిపారు. ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దేశ అవసరాలను తీర్చేందుకు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత అవసరమని నారాయణన్ చెప్పారు. దేశానికి ప్రతి ఏడాది సుమారు 50 లాంచ్ వెహికల్స్ అవసరమవుతున్న నేపథ్యంలో ప్రయోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కీలకమని వివరించారు. దేశ వ్యూహాత్మక అవసరాలు, అంతరిక్ష పరిశోధనలో ఇస్రో కీలక పాత్రను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!