

వివాహమైన ఆరు రోజులకే విడిపోయిన దంపతుల కేసులో నెలకు రూ.40 వేల మెయింటెనెన్స్ కోరుతూ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. భార్యాభర్తలు ఇద్దరూ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తుండటంతో వారి ఆర్థిక స్థితి దాదాపు సమానంగా ఉందని కోర్టు గుర్తించింది. భార్య చేసిన గృహ హింస ఆరోపణలను నిరూపించడంలో విఫలమయ్యారని జస్టిస్ రాకేశ్ కైంథ్లా పేర్కొన్నారు. కింది కోర్టులు కూడా ఆమె స్వయంగా తనను తాను పోషించుకునే ఆర్థిక సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించాయని తెలిపారు.
దీంతో భార్య దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించి, మెయింటెనెన్స్ నిరాకరిస్తూ కింది కోర్టులు ఇచ్చిన నిర్ణయాన్ని సమర్థించింది. ఈ కేసు 2023 అక్టోబర్‌లో జరిగిన వివాహం, ఆ తర్వాత చోటుచేసుకున్న విభేదాలు, విడిపోవడం నేపథ్యంలో నమోదైంది. ఈ నెల 3న వెలువడిన తీర్పులో ఇరువురి ఆర్థిక స్వావలంబన, మెయింటెనెన్స్ అవసరం వంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!