
జనరల్

టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ టెలివిజన్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. దీంతో భారత్‌తో పాటు నేపాల్, మాల్దీవులు, భూటాన్‌లోని క్రికెట్ అభిమానులు కూడా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం లభించనుంది. మూడు మ్యాచ్‌లూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి.
భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌తో తమ క్రికెట్ పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం కానుందని సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ రాజేశ్ కౌల్ తెలిపారు. ఇరు జట్లు దూకుడైన, వినోదాత్మక టీ20 క్రికెట్ ఆడతాయని, మూడు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!