
జనరల్

భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. పశువుల స్మగ్లర్లను వెంబడించే క్రమంలో ఆయన కుషియారా నదిలో గల్లంతయ్యారు. ఈ ఘటనతో సరిహద్దు భద్రతా సిబ్బందిలో విషాదం నెలకొంది. జవాన్ ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యల అనంతరం కుషియారా నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వరాష్ట్రం తెలంగాణకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!