

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో చాలామంది శారీరక శ్రమకు దూరంగా ఉంటారు. దీనివల్ల అలసట, కీళ్ల బిగుతు, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. జిమ్‌కు వెళ్లేందుకు సమయం లేదా అవకాశం లేనివారు ఇంట్లోనే కొన్ని సులభమైన వ్యాయామాలు చేయడం ద్వారా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవచ్చు. స్క్వాట్స్ చేయడం వల్ల తొడలు, పిరుదులు, పొత్తికడుపు కండరాలు బలపడతాయి. ప్లాంక్ వ్యాయామం కోర్ కండరాల బలాన్ని, భుజాల స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే లంజెస్ చేయడం వల్ల కాళ్ల కండరాలు బలోపేతం కావడంతో పాటు శరీర సమతుల్యత కూడా మెరుగుపడుతుంది.
చలికాలంలో శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు స్పాట్ జాగింగ్ లేదా జంపింగ్ జాక్స్ చేయవచ్చు. ఇవి గుండె స్పందన రేటును పెంచి రక్తప్రసరణ మెరుగుపడేందుకు దోహదపడతాయి. కండరాల బిగుతును తగ్గించి, వెన్నెముకను చురుకుగా ఉంచేందుకు సూర్య నమస్కారాలు లేదా సాధారణ స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా ఉపయోగపడతాయి. అయితే ఏ వ్యాయామం ప్రారంభించే ముందు వార్మప్ చేయడం, పూర్తయిన తర్వాత కూల్‌డౌన్ చేయడం తప్పనిసరి. శరీర సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామాలు చేయడం ద్వారా చలికాలంలోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!