
రాజకీయాలు

ఢిల్లీలో పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా లోక్‌సభను నవంబర్ 30న, రాజ్యసభను డిసెంబర్ 2న తిరిగి సమావేశపరచాలని స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌లను కోరింది. అవసరమైన ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
లోక్‌సభ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు, రాజ్యసభ డిసెంబర్ 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ కార్యకలాపాలను బట్టి ఉభయ సభల సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉందని కిరణ్ రిజిజు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!