
టెక్నాలజీ

దగ్గు మందులు మరియు ఇతర ఔషధ సిరప్‌ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేస్తూ, ఇకపై దగ్గు మందులు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా వైద్యుడి ప్రిస్క్రిప్షన్ సమర్పించాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ మేరకు వాటిని షెడ్యూల్ ‘కె’ ఔషధాల జాబితా నుంచి తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
గత ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నాసిరకం దగ్గు సిరప్ కారణంగా 20 మందికి పైగా చిన్నారులు మరణించిన ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణలో సంబంధిత సిరప్‌లో అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు తేలడంతో దానిపై నిషేధం విధించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజారోగ్య భద్రత దృష్ట్యా కేంద్రం ఈ కఠిన చర్యలు చేపట్టింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!