
సినిమాలు

ఏఐ సాయంతో సైబర్ నేరగాళ్లు భద్రతా వ్యవస్థలను దాటుకొని ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ గుర్తింపులు ఉపయోగించి ఫేషియల్ రికగ్నిషన్, కేవైసీ ప్రక్రియలను సులభంగా దాటేస్తున్నారని అధికారులు తెలిపారు.
సోషల్ మీడియా, జాబ్ వెబ్‌సైట్లు, డేటింగ్ యాప్స్, ఫోన్ కాల్స్ ద్వారా బాధితులను సంప్రదించి కెమెరా ముందు మాట్లాడేలా చేసి ముఖ సమాచారాన్ని దొంగిలిస్తున్నారని వెల్లడించారు. బ్యాంకులు డీప్‌ఫేక్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని, ప్రజలు తమ బయోమెట్రిక్ డేటాను జాగ్రత్తగా కాపాడుకోవాలని హోంశాఖ సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!