

తెలుగు సినీ ప్రేక్షకులకు సాయికుమార్ పేరు సుపరిచితం. గంభీరమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయనను తెలుగు చిత్రసీమ ప్రేమగా ‘డైలాగ్ కింగ్’ అని పిలుస్తుంది. 1961 జులై 27న జన్మించిన సాయికుమార్ ప్రముఖ నటుడు పి.జె. శర్మ కుమారుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన ప్రతిభతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవలే సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేశారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సాయికుమార్, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ‘పోలీస్ స్టోరీ’ చిత్రంతో హీరోగా సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రలు పోషిస్తూ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన గాత్రం, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సాయికుమార్‌కు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!