29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

Writer: Nithish 07:50 AM, 29 నవంబర్, 2026
కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లును ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనదిగా ఇండియా కూటమి నేతలు అభివర్ణించారు. పార్లమెంటులో ఈ బిల్లును సమష్టిగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో శనివారం వివిధ విపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు సమావేశమయ్యారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో బిల్లులోని అంశాలు, దాని ప్రభావంపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు ఈ బిల్లు నష్టం కలిగిస్తుందని, అధికారాన్ని శాశ్వతంగా తమ చేతుల్లో ఉంచుకోవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఖర్గే ఆరోపించారు.

సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌ ప్రక్రియను ఎన్నికల సంఘానికి అప్పగించడం సరికాదన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ నేతృత్వంలో ఈ ప్రక్రియ జరిగితే అక్రమాలకు అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్‌ స్థానాలను రిజర్వుడు స్థానాలుగా, రిజర్వుడు స్థానాలను జనరల్‌ స్థానాలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు. అయితే డీఎంకే, ఆప్‌, బిజూ జనతాదళ్‌, ఎన్సీపీ-ఎస్పీ పార్టీలు సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

ట్యాగ్లు
డీలిమిటేషన్‌ బిల్లుఇండియా కూటమిమల్లికార్జున ఖర్గేరాహుల్‌ గాంధీప్రియాంకా గాంధీపార్లమెంట్‌ సమావేశాలునియోజకవర్గాల పునర్విభజనమహిళా రిజర్వేషన్లుమాయావతిఎన్నికల సంఘం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్
టెక్నాలజీ

రెండు మైక్రాన్ల ఖచ్చితత్వంతో స్వదేశీ ఫైవ్‌ యాక్సిస్‌ CNC మెషీన్‌ను అభివృద్ధి చేసిన భారత్

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌
రాజకీయాలు

ప్రధాని పదవిని రాహుల్‌ తన జన్మహక్కుగా భావిస్తున్నారు: రాజ్‌నాథ్‌

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే
జనరల్

కేంద్రం డీలిమిటేషన్‌ బిల్లు ప్రజాస్వామ్యానికి ముప్పు: ఖర్గే

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ
జనరల్

లోక్‌సభ విస్తరణ వేళ రాజ్యసభ స్థానాల పెంపుపై చర్చ

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ
జనరల్

మహిళా రిజర్వేషన్ల అమలును ఎవరూ అడ్డుకోలేరు: మోదీ

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ
జనరల్

లోక్‌సభ స్థానాల పెంపు ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్‌గాంధీ

భారీ డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌
బిజినెస్

భారీ డేటా సెంటర్లకు హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

ఏటీఎం, పీఓఎస్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
బిజినెస్

ఏటీఎం, పీఓఎస్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

ప్రీ-ఐపీఓ షేర్ల ట్రేడింగ్‌కు ప్రత్యేక వేదిక.. సెబీ కీలక ప్రతిపాదన
బిజినెస్

ప్రీ-ఐపీఓ షేర్ల ట్రేడింగ్‌కు ప్రత్యేక వేదిక.. సెబీ కీలక ప్రతిపాదన

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌
క్రీడలు

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి
సినిమాలు

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!