
సినిమాలు

స్థానిక సంస్థల ఎన్నికలను నవంబర్ 15లోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్ణీత గడువులోగా ఎన్నికల ప్రక్రియను ముగించి, ఆ తర్వాత సాధారణ పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఆయా ప్రాంతాల ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల్లో పూర్తి స్థాయి ఫలితాలు సాధించేందుకు మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!