

అలనాటి ప్రముఖ నటి షావుకారు జానకి 94 ఏళ్ల వయసులో మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
400కు పైగా చిత్రాల్లో నటించి షావుకారు జానకి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆమె.. తనదైన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారని అన్నారు. ఆమె భౌతికంగా మనకు దూరమైనప్పటికీ, తెరపై పోషించిన పాత్రల ద్వారా ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
షావుకారు జానకి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చంద్రబాబు ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షావుకారు జానకి మరణం సినీ అభిమానులకు, చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోతుందని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!