
సినిమాలు

దిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. గోదావరి పుష్కరాల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.
అలాగే దక్షిణాది నదుల అనుసంధానాన్ని చేపట్టాలని ప్రధాని మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని ఆయన కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!