

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భారతదేశానికి అంతరిక్ష రంగంలో గర్వకారణమైన విజయాలను అందించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశం సాధించిన కీలక అంతరిక్ష విజయాల వెనుక ఎన్నో ఏళ్ల కృషి, అంకితభావం, నిరంతర పరిశోధనలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అడుగుపెట్టిన భారత్.. తన శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మహత్తర విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడం ద్వారా తెలంగాణ స్పేస్‌టెక్ హబ్‌గా ఎదుగుతోందని చెప్పారు. యువత కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విజ్ఞానమే మన బలం, ఆవిష్కరణలే మన భవిష్యత్తు, అంతరిక్షమే మన తదుపరి గమ్యం కావాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!