

టాలీవుడ్‌లో రాబోయే రెండు నెలలు ప్రేమకథలు,యువతను ఆకట్టుకునే సినిమాలతో సందడిగా మారనున్నాయి. పెద్ద చిత్రాలతో పాటు మధ్యస్థాయి సినిమాలు కూడా వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త జోడీలు, విభిన్నమైన కథలతో వస్తున్న చిత్రాలపై ఆసక్తి పెరుగుతోంది. ‘బేబీ’తో గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ ‘ఎపిక్’తో సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ‘90s - ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ స్పిన్-ఆఫ్‌గా వస్తున్న ఈ సినిమాపై యువతలో మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్న ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న విడుదల కానుంది.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటిస్తున్న ‘రోమాంచకం’ పల్లెటూరి నేపథ్యంలోని ప్రేమకథగా తెరకెక్కింది. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ నటిస్తున్న ‘వీసా’ అక్టోబర్ మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విదేశీ నేపథ్యంలో యువత ఎదుర్కొనే ప్రేమ, భావోద్వేగాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనుంది. వీటితో పాటు మరికొన్ని మధ్యస్థాయి చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అల్లరి నరేష్ సినిమాలతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా పోటీలో ఉండటంతో రాబోయే సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!