

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేష్, నారా రోహిత్ మధ్య సాగే ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలను హాస్యం, వినోదంతో కూడిన హైడ్ అండ్ సీక్ తరహాలో రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో నారా రోహిత్ ఎంట్రీ ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వనుందని టాక్. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు కూడా కథలో పెద్దపీట వేసినట్లు సమాచారం.
వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా పేతురాజ్, యువిన్, రాజ్ ప్రజ్పల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ కుటుంబ భావోద్వేగాలు, వినోదంతో పాటు వెంకటేష్–నారా రోహిత్ ట్రాక్, ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!